కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ కీలక పాత్రధారులు. విజయ్ కార్తికేయ దర్శకుడు. కలైపులి ఎస్ ధాను నిర్మాత. ఈ చిత్రం తెలుగులో డిసెంబర్ 25న విడుదల కానుంది. అర్జున్ మహాక్షయ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఇందులో సుదీప్ కనిపించనున్నారని, సుదీప్ నట విశ్వరూపాన్ని ఆవిష్కరించే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుద్ భట్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: శేఖర్‌చంద్ర, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: వి.క్రియేషన్స్, కిచ్చా
క్రియేషన్స్.