Kichcha Sudeep | కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం ‘దేవరాయ’ (Devaraaya) టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సుదీప్ ప్రసిద్ధ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించనున్నారు. “కన్నడ రాజ్య రామ రమణ.. మూడు రాయరా గండ.. ఆంధ్ర భోజ.. శ్రీకృష్ణదేవరాయ” అనే పవర్ఫుల్ బిరుదులతో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
ఈ చిత్రంలో సుదీప్ కిచ్చా ‘దేవరాయ’గా వెండితెరపై అలరించనున్నారు. ఈ పాన్-ఇండియా మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, సినిమాను 2027 డిసెంబర్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సుదీప్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.