War-2 Movie Heroine | రెండు నెలల కిందట ప్రకటన వచ్చిన వార్-2 గురించి ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంది. కలలో కూడా ఊహించని కాంబినేషన్ సెట్టయ్యే సరికి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో ఒక్క సారిగా ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లను ఒకే సారి స్క్రీన్‌పై చూడబోతున్నాం అనే ఫీలింగే ఒక హై ఇస్తుంది. అందులోనూ హీరోగా ఒకరు విలన్‌గా మరొకరు కనిపిస్తారనడం గూస్బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ స్క్రిప్ట్‌ను తుది దశకు మెరుగులు దిద్దుతున్నాడట. రేపో మాపో స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసి మరోసారి ఆ ఇద్దరు హీరోలను కలవబోతున్నాడట.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట నిన్నటి నుంచి తెగ హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని ఫిక్స్ అయిందని సమాచారం. అయితే ఎవరికి జోడీగా కియారా నటిస్తుందనదే క్లారిటీ రావాల్సి ఉంది. ఒకే మిషన్ మీద వ్యతిరేక దిశలో పనిచేస్తున్న ఈ ఇద్దరు హీరోలు ఆఖరికి దేశం కోసం ఒక్కటై చేతులు కలిపి దేశ ద్రోహుల అంతు చూడటమనే మేయిన్ పాయింట్‌తో ఈసినిమా తెరకెక్కనుందట. యష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తు్ంది.