Kiara Advani | వార్ 2 ఫెయిల్యూర్ తర్వాత కియారా అద్వానీకి ఎదురుదెబ్బలు .. కాంట్రాక్ట్ రద్దు?
Kiara Advani | బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. భారీ అంచనాలతో విడుదలైన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవడంతో, కియారాకు భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో అనేక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.
Kiara Advani | బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. భారీ అంచనాలతో విడుదలైన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవడంతో, కియారాకు భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో అనేక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన వార్ 2 చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదలై మొదటి వీకెండ్ వరకూ చక్కటి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ కావడంతో భారీ నష్టాలు మిగిలాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రం డిజాస్టర్ కావడంతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వార్ 2 విఫలమైన తర్వాత YRF స్పై యూనివర్స్ ప్రాజెక్టులపై మళ్లీ వ్యూహాలు పునః సమీక్షించబడుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
కియారా అద్వానీతో వైఆర్ఎఫ్ మూడు సినిమాల డీల్ చేసినట్లు సమాచారం. స్పై యూనివర్స్ లో ప్రధాన మహిళా పాత్రల కోసం ఆమెను ఎంపిక చేసినప్పటికీ, తాజా ఫలితంతో ఆ కాంట్రాక్ట్ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్ 2 చిత్రంలో కియారా తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కెరీర్లో తొలిసారి బికినీ లుక్ లో కనిపించారు. కానీ కథా బలం లేకపోవడంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సినిమా విఫలమైంది. ఫలితంగా కియారాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల తల్లి అయిన కియారా, ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్ తీసుకున్నారు. ఈ కారణంగా కూడా ఆమె కొత్త సినిమాలకు కొంత విరామం ఇచ్చారు.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వైఆర్ఎఫ్ సంస్థ స్పై యూనివర్స్‌లో తదుపరి ప్రాజెక్టులకు కొత్త భామలని ఎంపిక చేయాలని చూస్తుందనే టాక్ వినిపిస్తుంది. వార్ 2 పరాజయం తర్వాత బాలీవుడ్ లో హై బడ్జెట్ యాక్షన్ సినిమాలపై మరోసారి సమీక్ష ప్రారంభమైందని తెలుస్తోంది. ప్రేక్షకులు కొత్త కథలు, లోతైన భావోద్వేగాలు కోరుకుంటున్నారు అని నిర్మాతలు విశ్లేషిస్తున్నారు. తారల గ్లామర్ మాత్రమే కాదు, కథకు బలం అవసరం అనే విషయాన్ని ఈ ఫలితం మళ్లీ రుజువు చేసింది. మరి వార్ 2 ఫెయిల్యూర్ కియారాకు ఎంత వరకూ ఇబ్బంది కలిగిస్తుందో వేచి చూడాల్సిందే. YRF అధికారికంగా కాంట్రాక్ట్ గురించి ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, బాలీవుడ్ బిజినెస్ వర్గాల్లో గుసగుసలు ఊపందుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

