Khushi Movie Songs | వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఖుషీపై ప్రేక్షకుల్లో మాములు అంచనాలు లేవు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాపై అమితాసక్తి చూపిస్తున్నారు. లైగర్ వంటి భారీ డిజాస్టర్ వచ్చిన రూ.60 కోట్ల రేంజ్లో బిజినెస్ జరుతుందంటే విశేషం అనే చెప్పాలి. ఇప్పటికే ట్రైలర్ సహా పాటలన్నీ జనాలకు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేశాయి. ఇక ఇవన్నీ ఒకెత్తయితే మొన్న జరిగిన ఖుషీ మ్యూజిక్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల లైవ్ పర్ఫార్మెన్స్ ఊహించని రేంజ్లో బజ్‌ను తెచ్చిపెట్టింది. దర్శకుడు నిర్వాణ సైతం సినిమాకు వచ్చిన కపుల్ జంటలకు మాత్రం మరిచిపోలేని జ్ఞాపకాలు తీసుకుపోతారని ఓ హెవీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంకేముంది ఆ ఒక్క మాటతో సినీ లవర్స్ ఈ సినిమాపై చాలా పాజిటీవ్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల స్పీడ్ పెంచింది.
ప్రమోషన్లో భాగంగా తాజాగా ఈ సినిమా 5వ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఓసీ పెళ్లామా అంటూ రిలీజైన ఫ్రస్టెషన్ సాంగ్ ప్రోమో శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వాహద్ స్వర పరిచిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, సాకేత్ కలిసి ఆలపించారు. దర్శకుడు శివ నిర్వాణ సాహత్యాన్ని అందించాడు. ఈ పాట ఫుల్ సాంగ్‌ను ఆగస్టు 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాలో అన్ని పాటలకు శివ నిర్వాణనే సాహిత్యం అందించడం విశేషం. స్వర్గీయ దాసరి నారాయణ రావు తర్వాత ఒక సినిమాలో అన్ని పాటలకు లిరిక్స్ అందించిన ఘనత బహుశా శివ నిర్వాణకే దక్కింది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా సమంత నటిస్తుంది. నిజానికి ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. అంతేకాకుండా ముందుగా ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ సైతం ప్రమోషన్లు భారీ రేంజ్లో జరుపుతున్నాడు.