Thalapathy 68 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దళపతి 67గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే మరోవైపు దళపతి 68 వార్త కూడా ఇప్పటికే తెరపైకి వచ్చింది. వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో దళపతి 68 ఉండబోతుంది.
కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండు క్రేజీ వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించబోతుందట. వెంకట్ ప్రభు ఇటీవలే జ్యోతిక-సూర్య కపుల్‌ను సంప్రదించి.. ఇదే విషయమై చర్చించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్సైడ్ టాక్. 2000వ సంవత్సరంలో రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఖుషిలో నటించారు విజయ్-జ్యోతిక. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరి కాంబినేషన్ దళపతి 68లో సందడి చేయబోతుండటం దాదాపు ఖాయమైనట్టేని కోలీవుడ్ సర్కిల్ టాక్.
ఖుషి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఎస్జే సూర్య (SJ Suryah) ఇందులో విలన్‌గా కనిపించబోతుండటం మరో ఇంట్రెస్టింగ్ విషయం. ఈ నేపథ్యంలో మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై ఖుషి క్రేజీ కాంబో ఎంటర్టైన్ మెంట్ ఎలా ఉండబోతున్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. దళపతి 68కు సంబంధించిన పూర్తి వివరాలపై విజయ్ పుట్టినరోజైన జూన్ 22న క్లారిటీ రానుంది.
Thalapathy68