Cinema News | రాహుల్ విజయ్, నేహా పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’. అశోక్ రెడ్డి కడదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ దాస్యన్ నిర్మాత. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను హీరో రానా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉందని, ఇన్నోవేటివ్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు.
వినూత్న కథతో ఈ సినిమా ను రూపొందించామని, ఆద్యంతం వినోద ప్రధానంగా ఆకట్టుకుంటుందని, మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు అశోక్ రెడ్డి పేర్కొన్నారు. అజయ్‌ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ కొప్పెర, సంగీతం: సురేష్ బొబ్బిలి, దర్శకత్వం: అశోక్ రెడ్డి కడదూరి.