ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ సంగీత దర్శకురాలిగా పరిచయం కాబోతున్నది. ఆమె ఇప్పటికే రెహమాన్ సంగీత దర్శకత్వంలో పలు చిత్రాల్లో పాటలు పాడి నేపథ్య గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ‘రోబో’, ‘మిమి’, ‘మిలి’, ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రాల్లో ఖతీజా పాటలు పాడింది. ఆమె ప్రస్తుతం తమిళ దర్శకురాలు హాలితా రూపొందిస్తున్న మిన్మినీ చిత్రానికి స్వరకర్తగా పనిచేస్తున్నది. ఈ విషయాన్ని దర్శకురాలు హాలితా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘ఖతీజాతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆమె మంచి గాయని మాత్రమే కాదు అద్భుతమైన స్వరకర్త. ఈ సినిమాలో సరికొత్త సంగీతాన్ని వింటారు’ అని పోస్ట్ చేసింది.