KGF 2 effect |ప్రభాస్ అభిమానులకు షాకిచ్చిన ప్రశాంత్ నీల్.. సలార్ పరిస్థితేంటి..?
సలార్ సినిమా ఏప్రిల్ 14, 2022న విడుదలవుతుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే రోజు కేజీఎఫ్ 2 సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు

చాలా రోజుల నుంచి ప్రభాస్ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈయన ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఏది ఎప్పుడు వస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల తేదీలు ఖరారు చేశారు. కానీ అవి మళ్లీ ఇప్పుడు మారిపోతున్నాయి. పరిస్థితుల ప్రభావంతో కొత్త రిలీజ్ డేట్స్ వైపు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా సలార్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14, 2022న విడుదలవుతుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ విడుదల తేదీ వాయిదా పడటం అనివార్యమే.
ఎందుకంటే అదే రోజు కేజీఎఫ్ 2 సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. 2021లోనే కేజీఎఫ్ 2 వస్తుందని అందరూ అనుకున్నారు. సినిమా పూర్తయినా కూడా ప్రస్తుతం పరిస్థితులు ఇంకా పూర్తిగా గాడిన పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద సినిమా విడుదల చేయడం రిస్కుతో కూడుకున్న వ్యవహారమే. అందుకే నిర్మాతలు ఏకంగా తమ సినిమాను మరో ఆర్నెల్లు వాయిదా వేశారు. సెప్టెంబర్ 2021 విడుదలకు ప్లాన్ చేసుకున్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 14, 2022 తమ సినిమాను వాయిదా వేశారు.
ఇక అదే రోజు విడుదల చేస్తామని చెప్పిన సలార్ మరో కొత్త తేదీ చూసుకోవాల్సిందే. ఇక్కడ విషయం ఏంటంటే కేజీఎఫ్ 2, సలార్ రెండు సినిమాలను నిర్మిస్తోంది హోంబల్ ఫిలింస్ బ్యానర్‌నే. పైగా రెండు సినిమాలకు ఒకడే దర్శకుడు. అతడే ప్రశాంత్ నీల్. అనుకున్న దానికంటే ప్రభాస్‌తో చేస్తున్న సినిమా కాస్త నెమ్మదిగా షూటింగ్ జరుగుతుంది. అందుకే విడుదల తేదీ కూడా వాయిదా పడింది. దాంతో ప్రభాస్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. సలార్ కొత్త విడుదల తేదీ ఎప్పుడు చెప్తారు అంటూ చిత్ర యూనిట్ ను అడుగుతున్నారు. ఏదేమైనా కూడా కేజీఎఫ్ 2 కోసం ప్రభాస్ సినిమాను పక్కన పెట్టేశాడు ప్రశాంత్ నీల్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nani vs Theater Owners | సీన్ యూ టర్న్.. నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్స్ అసోసియేషన్
OTT ఎఫెక్ట్ : ఓవర్సీస్లో టాలీవుడ్‌కు ఊహించని దెబ్బ !
రకుల్ ప్రీత్ సింగ్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్న అల్లు అర్జున్
ఈ హీరోయిన్ నాన్‌స్టాప్‌గా 48 గంటలు పడుకుంటుందట..!
KOTA: నమస్కారం చెప్పా, వెంటనే బాలయ్య నాపై ఉమ్మాడు: కోట
ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలనుందట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

