,Srinidhi Shetty | నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ప్రస్తుతం వైజాగ్లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నది. కథానుగుణంగా ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, వైజాగ్ షెడ్యూల్లో శ్రీనిధి శెట్టి పాల్గొంటున్నదని చిత్ర బృందం పేర్కొంది. నాయకానాయికలపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నామని, పోలీస్ ఆఫీసర్గా నాని పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. 2025 మే 1న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.