Salaar | అదేంటి కథ చెప్తే సంతోషపడాలి కదా.. షాక్ ఎందుకు అవుతున్నారని అనుకుంటున్నారు కదా. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఇన్ని రోజులు సలార్ పూర్తిగా యాక్షన్ సినిమా అని.. అందులో ఫైట్స్ తప్ప ఇంకేమీ ఉండవు అని అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా కూడా కేజీఎఫ్ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా లోపల ఎమోషన్ భారీగానే ఉంటుందనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ప్రభాస్‌తో ప్రశాంత్ ఎలాంటి ఎమోషన్ పండించాడు అనేది మాత్రం ఇన్ని రోజులు సస్పెన్స్‌గానే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ మెయిన్ థీమ్ బయట పెట్టాడు దర్శకుడు.
అందరూ అనుకుంటున్నారు ఇది యాక్షన్ సినిమా కాదు అంటూ బాంబు పేల్చాడు. టీజర్లో అంతగా యాక్షన్ కనిపిస్తుంది.. పైగా ప్రభాస్‌ను డైనోసార్ అంటూ బిల్డప్ కూడా ఇచ్చాడు కదా.. ఇప్పుడు యాక్షన్ లేకపోవడం ఏంటని అనుకుంటున్నారా..! అసలు విషయం ఏంటంటే సలార్ సినిమాలో యాక్షన్ కంటే ఎక్కువగా ఎమోషన్ ఉండబోతుంది. కేజీఎఫ్‌లో మదర్ సెంటిమెంట్ ఎలాగైతే వర్కవుట్ అయ్యిందో ఇక్కడ ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా కథ అంతా స్నేహం చుట్టూ తిరుగుతుంది అని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఇద్దరు స్నేహితుల కథ సలార్ అంటూ చెప్పేశాడు. ప్రభాస్ తోపాటు ఇందులో మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. కథ భారీగా ఉండటంతో రెండు పార్ట్స్ చేయక తప్పలేదు అని చెప్తున్నాడు దర్శకుడు.
ఫస్ట్ పార్ట్‌లో సగం కథ చెప్పి.. మిగిలిన పూర్తి కథ రెండో భాగంలో చెప్తామంటున్నాడు ఈయన. డిసెంబర్ 22న సలార్ మొదటి భాగం విడుదల కానుంది. దీని మీద అంచనాలు ఎలా ఉన్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఖాన్ డంకీ సినిమా కూడా డిసెంబర్ 21న వస్తున్న కూడా.. అందరి అంచనాలు సలార్‌పైనే ఉన్నాయి. ఇది గాని సరిగ్గా వర్కవుట్ అయ్యిందంటే ప్రభాస్ కెరీర్లో మరో 1000 కోట్ల సినిమా ఖాయం. మొత్తానికి ప్రశాంత్ నీల్ స్నేహం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.