Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ కంగువ (Kanguva). సూర్య 42గా వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేం అవినాష్ (BS avinash)భాగం అయ్యాడు. ప్రస్తుతం కొనసాగుతున్న చెన్నై షెడ్యూల్లో జాయిన్ అయ్యాడు అవినాష్. తాజా అప్డేట్ ప్రకారం ఇందులో విలన్‌గా నటించబోతున్నాడు అవినాష్.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ తో కలిసి తెరకెక్కిస్తున్న కంగువ ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కానుంది. కంగువ ౩డీ ఫార్మాట్లో కూడా విడుదల కానుంది. కంగువ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుమారు రూ.300 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ ఏడాది బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన వీరసింహారెడ్డి చిత్రంలో ముసలి మడుగు గంగిరెడ్డి పాత్రలో కనిపించాడు అవినాష్. మరి సూర్య సినిమాలో ఎలా కనిపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. సూర్య మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
#KANGUVA : Avinash On BOARD⭐
• #KGF Fame Actor #Avinash On BOARD For Chennai Schedule🔥
• He is Likely To Play Antagonist Role in Periodic Portion Of The Film 💪🏾#Suriya | #DishaPatani | #DSP
Directed By #SiruthaiSiva. pic.twitter.com/tmKUvG8nAC— Saloon Kada Shanmugam (@saloon_kada) June 21, 2023
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023