Sukrithi | ఘనంగా ‘కేరింత’ నటి నిశ్చితార్థం.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు!
Actress sukrithi Engagement | ‘కేరింత’ సినిమా గురించి అందిరికి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారి విజయం సాధించింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించగా శ్రీదివ్య హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌కు సమానంగా ఉండే మరో పాత్ర భావన. భావన రోల్లో సుకృతి నటించింది. నిజానికి హీరోయిన్ కన్నా ఎక్కవ నిడివి గల పాత్ర ఈమెది. ఈ ఒక్క సినిమాతోనే యూత్‌ను కళ్ళుతిప్పుకోకుండా చేసింది. ఈ సినిమాలో తన నటన, క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె సినిమాలను దూరంగా ఉంటుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలో పెళ్ళిపీటలెక్కబోతుంది. తాజాగా సుకృతికి అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో
నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట తమ తమ ఇన్‌స్టా పేజ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుకృతి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నా ప్రపంచం నాన్న. భయపడినప్పుడు నా భుజం తడుతూ, నన్ను సంతోషపరుస్తూ, నా చేయి పట్టుకుని నడిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నాడు. ఎప్పుడు ఉత్తమ నాన్నలాగే ప్రవర్తించాడు. ఐదేళ్ళ క్రీతం అమ్మ చనిపోయింది. అప్పటి నుండి అమ్మ ప్రేమను సైతం తానే అందించాడు. సింగిల్ పేరెంట్‌గా ఉండటం అంత సులువేం కాదు. నాకు తెలిసిన బలమైన వ్యక్తివి నువ్వే నాన్న.. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్’ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

