కీర్తి సురేశ్ మంచి నటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ‘మహానటి’ సినిమాకు గాను జాతీయ ఉత్తమనటిగా అవార్డును కూడా అందుకున్నారామె. అయితే.. ఇటీవల తన లేటెస్ట్ సినిమా ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో తనలో దాగున్న మరో ప్రతిభ గురించి కూడా చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్. ఇంతకీ ఆ ప్రతిభ ఏమిటనుకుంటున్నారు?! ‘డైరెక్షన్’.
మెగా ఫోన్ పట్టడం ఈ అందాలభామ డ్రీమ్ అట. కీర్తి సురేశ్ మాట్లాడుతూ ‘నాకు కథలు చెప్పడం ఇష్టం. నచ్చిన కొన్ని కథల్ని ప్రేక్షకులకు చెప్పాలని ఉంది. ఏమో ఫ్యూచర్లో డైరెక్షన్ చేయొచ్చు. ఇప్పుడైతే యాక్టింగ్‌లో బిజీగా ఉన్నాను. కాస్త సమయం దొరికితే కచ్చితంగా నా కోరిక మాత్రం తీర్చుకుంటా.’ అంటూ చెప్పుకొచ్చింది.