‘ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిల్మ్. ఈ సినిమాలో నేను ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో కనిపిస్తా. నన్ను రీటా పాత్రలో దర్శకుడు అద్భుతంగా చూపించారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘రివాల్వర్ రీటా’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. జేకే చంద్రు దర్శకుడు. రాధికా శరత్‌కుమార్, సునీల్, అజయ్‌ఘోష్ ప్రధాన పాత్రధారులు. బుధవారం హైదబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ పై విధంగా స్పందించింది. ఒక్కరోజులో జరిగే ఈ కథలోని మలుపులు ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తాయని, కామెడీ..యాక్షన్ కలబోతగా సినిమా మెప్పిస్తుందని తెలిపింది. తన కెరీర్లో ఇలాంటి హ్యూమర్ ఉన్న పాత్రను ఇప్పటివరకు చేయలేదని, నటిగా ఇదొక కొత్త అనుభమని కీర్తి సురేష్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సీన్ రోల్డాన్, నిర్మాతలు: సుదన్ సుందరం, జగదీష్ పళనిసామి, రచన-దర్శకత్వం: జేకే చంద్రు.