సూపర్ స్టార్ మహేశ్ బాబు వయసు రోజురోజుకు తగ్గుతుంది తప్ప పెరగడం లేదు. తాజాగా ఆయన 46వ వసంతంలోకి అడుగు పెట్టాడు. కానీ మహేశ్‌ను చూస్తుంటే మాత్రం అలా అనిపించడం లేదు. 25 ఏళ్ల కుర్రాడు ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఉన్నాడు. మరీ ముఖ్యంగా సర్కారు వారి పాట టీజర్ విడుదలయిన తర్వాత అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. మా హీరో ఏంటి ఇలా ఉన్నాడు.. మరీ ఇంత కుర్రాడిలా ఉంటే ఎలా అంటూ అంటూ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేశ్ బాబుతో జోడి కట్టిన కీర్తి సురేష్ కూడా ఇదే చెబుతుంది. ఇప్పటికే టీజర్లో ఈమె చెప్పిన డైలాగ్ వైరల్ అయింది. సార్ కు ప్రతి రోజు పడుకునే ముందు కచ్చితంగా దిష్టి తీయండి అంటూ కీర్తి సురేష్ చెప్పిన డైలాగ్ ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు.
#Namrata Ma’am, Sir padukune mundhu prathiroju dhisti theeyadam marchipokandi 😀🙏🏻 @urstrulyMahesh @ParasuramPetla @MythriOfficial @GMBents #SarkaruVaariPaata #HBDSuperstarMaheshBabu pic.twitter.com/3pGubMttfs
— Keerthy Suresh (@KeerthyOfficial) August 9, 2021
ఇప్పుడు ఇదే డైలాగ్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది కీర్తి. మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌కు ఇదే మాట చెప్పింది. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా రోజంతా దేశ విదేశాల్లోని ఆయన అభిమానులతో పాటు.. సినీ ప్రముఖులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు మహేశ్‌ను విష్ చేశారు. ఈ క్రమంలోనే కీర్తి కూడా కొత్త పద్ధతిలో మహేశ్ బాబును విష్ చేసింది. సినిమాలో ఆయన బుగ్గ గిల్లుతున్న స్టీల్ ట్విట్టర్లో పోస్ట్ చేసి.. నమ్రత మేడం, సార్‌కు రోజు పడుకునే ముందు దిష్టి తీయడం మరిచిపోకండి అంటూ పోస్ట్ చేసింది. దాంతో పాటు లవ్ సింబల్ కూడా పెట్టింది. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏదేమైనా అమ్మాయిలు కూడా కుళ్ళుకునే అందంతో మహేశ్ మరీ రోజురోజుకి యంగ్ అయిపోతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో రానాకు అన్యాయం చేస్తున్నారా..?
సరికొత్త రికార్డులు సెట్ చేసిన మహేష్ బాబు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Prakash Raj Surgery | ప్రకాశ్ రాజ్‌కు సర్జరీ..అసలేం జరిగిందంటే..?