Keerthy Suresh | మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. నేను శైలజా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. తర్వాత నాని సరసన నేను లోకల్ మూవీలో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్‌కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతుంది కీర్తి. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కడమే కాకుండా ఏకంగా జాతీయ అవార్డ్ కూడా దక్కింది.
కీర్తి సురేష్ పెద్దగా అందాలు ప్రదర్శించడానికి ఇష్టపడదు. తన టాలెంట్‌తోనే మంచి అవకాశాలు అందిపుచ్చకుంది. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. కాని ఇటీవల ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తోంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి రెడీ అంటుంది. ఆ మధ్య హీరో వరుణ్ ధావన్‌తో కలిసి చేసిన ‘బేబీ జాన్” అనే హిందీ సినిమాలో ఓ రేంజ్లో అందాలను ఆరబోసింది. కాని అంత చేసిన ఈ ముద్దుగుమ్మకి అదృష్టం కలిసి రాలేదు. ఇక ఇటీవల సోషల్ మీడియాలోను అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది.
అయితే కీర్తి సురేష్ న్యూ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. బాయ్స్ హెయిర్ స్టైల్ లో ఉన్న ఈ హీరోయిన్ ను చూసి అవాక్కవుతున్నారు. ఏదైనా కొత్త సినిమా కోసం ఇలా రెడీ అయ్యారా లేదంటే AI టెక్నాలజీతో రూపొందించిన ఫోటోనా అని ఆలోచనలో పడ్డారు..సమ్మర్ మొదలైంది కదా అందుకే ఈ లుక్‌లోకి కీర్తి సురేష్ వచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైన కీర్తి సురేష్ రూపాన్ని పూర్తిగా మార్చి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో కీర్తి సురేష్ కొత్త లుక్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఇక గతేడాది కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల తన ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ ప్రైజ్ ఇచ్చింది.