Keerthy Suresh| మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందిపుచ్చుకుంది కీర్తి సురేష్. ఈ అమ్మడు నేను శైలజా అనే మూవీతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమాతో అలరించిన ఈ భామ మహానటిలో అద్భుతమైన నటనతో భారీగా అభిమానులని సొంతం చేసుకుంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ కి లేడి ఓరియెంటెడ్ సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఆ సినిమాలకి కీర్తి కెరియర్‌కి ప్లస్ కాలేదు. ఈ క్రమంలో కథలో విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే కెరియర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కింది.
డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీని వివాహం చేసుకుంది. 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి అందరు షాక్ అయ్యాడు. స్కూల్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి సినిమాలలోకి వచ్చిన కూడా తన ప్రేమకి ఎక్కడ పులిస్టాప్ పెట్టలేదు. చివరికి ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. . డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అట్టహాసంగా జరిగింది. అయితే వీరి పెళ్లి మొదట హిందూ సంప్రదాయం ప్రకారం జరగగా, ఆ తర్వాత భర్త ఆంటోనీ సంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ పద్దతిలో జరిగింది. ఇటీవల తన పెళ్లికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. అవి నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.
అయితే పెళ్లి తర్వాత కీర్తి బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. మెడలో తాళితోనే కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత కీర్తి సురేష్ హనీమూన్ వెళ్లింది. ఆ ఘట్టం పూర్తి కాగానే, తన తర్వాత సినిమాలపై కీర్తి ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తమిళంలో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ సెల్వన్ తో మూవీకి ఓకే చెప్పింది. ఈ సినిమాను..గుడ్ నైట్, లవర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది. పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ సినిమాలకు గుడ్ బై చెబుతుందనే ప్రచారం జరగగా,ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంకా.. కీర్తి ఖాతాలో కన్నేవేడి, రివాల్వర్ రీటా చిత్రాలు ఉన్నాయి.