‘సాంకేతికత సమాజానికి ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. మనసుల్లో మలినం పేరుకుపోయిన మనుషుల చేతికి సాంకేతిక వస్తే అది సమాజానికే ప్రమాదం.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ‘మహానటి’ కీర్తిసురేశ్. ఆమె తాజా సినిమా ‘రివాల్వర్ రీటా’ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితంపై టెక్నాలజీ ఎలాంటి చెడు ప్రభావం చూపించిందో వెల్లడించారు.
‘ఏఐ చేసిన డీప్ ఫేక్ ఫొటోలకు బలైన సినీ సెలబ్రిటీలలో నేనూ ఒకదాన్ని. ఈ టెక్నాలజీని ఉపయోగించి నేను ధరించిన డ్రెస్‌ని మార్చేశారు. నేను అసభ్యకరమైన పోజులిచ్చినట్టు క్రియేట్ చేశారు. చూడ్డానికే అసహ్యంగా ఉన్న ఆ ఫొటోలను చూసి షాకయ్యాను. నేను వివాహితను. ఒకరి ఇల్లాలిని. అలాంటి నాపై ఇలాంటి ప్రయోగాలు చేయడం నన్ను మరింత బాధించింది.’ అంటూ వాపోయారు కీర్తి సురేశ్.