Akka First Look | మహానటితో నేషనల్ అవార్డు సాధించిన నటి కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ అక్క(AKKA). బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఇందులో కీలక పాత్రలో నటించబోతుంది.
యష్ రాజ్ ఫిలిమ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను వదిలింది. ఈ టీజర్ చూస్తుంటే.. కీర్తి ఇందులో లేడి డాన్ అక్కగా కనిపించబోతుంది. పెర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుందని అనే స్టోరీలైన్‌తో ఈ సినిమా రాబోతుంది.