బాలీవుడ్లో ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది మహానటి కీర్తి సురేశ్. ఇందులో ఈమె ఓ మాఫియా డాన్‌గా కనిపిస్తుందట. రీసెంట్గా ఈ విషయంపై బాలీవుడ్ మీడియా కీర్తి సురేష్‌ని ప్రశ్నించింది. కీర్తి మాట్లాడుతూ ‘ఇదొక ఛాలెంజింగ్ రోల్. నటిగా నాకు మాత్రమే ఇలాంటి పాత్రలు దక్కడం అదృష్టం. ఇందులో నా గెటప్, శారీరక భాష పెక్యులర్‌గా ఉంటాయ్.
దర్శకుడు ధర్మరాజ్ శెట్టి అద్భుతమైన కాన్సెప్ట్‌తో ‘అక్క’ను తీర్చిదిద్దుతున్నారు. కథానుగుణంగా రాధికా ఆప్టే ఈ సిరీస్‌కి కథానాయిక. మరి ‘అక్క’ ఎవరు? అనే విషయం మాత్రం సస్పెన్స్.’ అంటూ అందంగా నవ్వేసింది కీర్తి సురేశ్. ప్రతిష్టాత్మక యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సిరీస్ రూపొందుతున్నది.