Rowdy Janardhan | “మహానటి” చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్, తన పాత్రల ఎంపికలో కొత్త ధోరణిని అనుసరిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకున్న కీర్తి, ఇప్పుడు తన “వెర్షన్ 2.0″ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుకు కారణం విజయ్ దేవరకొండతో ఆమె నటించబోయే సినిమా ‘రౌడీ జనార్దన్’.
తాజా సమాచారం ప్రకారం, రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ జనార్దన్’ చిత్రంలో కీర్తి సురేష్ రొమాంటిక్ పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కీర్తి సురేష్ ఏ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించలేదు. ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్ బాబుతో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి లిప్ లాక్ లేదు. అయితే, ‘రౌడీ జనార్దన్’లో మాత్రం ఇది నిజం కావచ్చని అంచనా వేస్తున్నారు.
కీర్తి సురేష్ తన కెరీర్లో ప్రయోగాలు చేయడానికి వెనుకాడదు. బాలీవుడ్లో ‘బేబీ జాన్’తో అడుగుపెట్టినప్పటికీ, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే, ఆమెకు అక్కడ కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. పాత పద్ధతిలో వెళితే పని అవ్వదని గ్రహించిన ఈ అమ్మడు రూట్ మార్చినట్లు తెలుస్తుంది.
ఇక రౌడీ జనార్దన్ సినిమా విషయానికి వస్తే.. ఇది ఒక మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండకు ‘రౌడీ’ ఇమేజ్ ఉండటంతో, ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంలో, స్థానిక రాజకీయాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.