Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) చిత్రాల ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా.. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
Dappulu thiyyaaley.. #VivekSagar mass jaathara shuru aithundhi 🥁#KayyaalaChindhaata from #KeedaaCola to be out on Oct 26#KeedaaColaOnNov3@RanaDaggubati @VGSainma @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @saregamasouth pic.twitter.com/5O6sbdTEx0
— Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) October 25, 2023
‘కయ్యాల చిందాట’ (Kayyaala Chindhaata) అనే సెకండ్ సింగిల్‌ను అక్టోబర్ 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్లో తెలుపుతూ.. డప్పులు తియ్యాలే.. వివేక్ సాగర్ మాస్ జాతర షూరు ఐతుంది. కయ్యాల చిందాట రేపు వస్తుంది అంటూ రాసుకోచ్చారు. ఇక వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మదాడి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.