Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) చిత్రాల ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ వచ్చింది.
‘కయ్యాల చిందాట’ (Kayyaala Chindhaata) అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను కీడా కోలా మేకర్స్ విడుదల చేశారు. సాంగ్ ఫుల్ మాస్ జాతరల సాగగా.. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాటకే హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ పాటకు నిక్లేష్ సుంకోజీ లిరిక్స్ అందించగా.. హేమచంద్ర, వివేక్ సాగర్ కలిసి పాడాడు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మదాడి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
Oora mass redefined. Andharuu chindeyyali inka🕺
Here’s #KayyaalaChindhaata from #KeedaaCola
▶️ https://t.co/nossROlRp1#KeedaColaOnNov3
🎵 #VivekSagar
🎤 @itsvedhem
✍️ #NikleshSunkoji@RanaDaggubati @VGSainma @IamVishnuOi @JeevanKumar459 @saregamasouth pic.twitter.com/vH7riO8aIY— Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) October 26, 2023