యువతలో మంచి క్రేజ్ ఉన్న కథానాయికల్లో కయాదు లోహర్ ఒకరు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో ఈ అందాలభామ బిజీబిజీగా ఉన్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ని జత చేసింది. ‘సోషల్‌మీడియా నుంచి ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను. శరీరం మాదిరిగానే మనసుకు కూడా విశ్రాంతి అవసరం.
నాతో నేను ఎక్కువగా గడిపేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పటిదాకా సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మళ్లీ కలవాలని అనిపిస్తే తప్పకుండా కలుస్తా’ అంటూ రాసుకొచ్చింది కయాదు లోహర్. సో.. కొన్నాళ్లపాటు ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో ఉండదన్నమాట. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’లో కయాదు కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.