కవితరాజ్పుత్, జమున, అంజలి, మధు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కావ్య రాజ్’. మధు లింగాల దర్శకుడు. గజగౌని దయానంద్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ విడుదల చేశారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘తెలంగాణ నేపథ్యంలో రూపొందించిన మూకీ చిత్రమిది.
కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.