Bigg Boss 5: ఏడిస్తే హౌజ్ నుండి మొదట బయటకు వచ్చేది నువ్వే.. కౌశల్ సూచన

బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో సెప్టెంబర్ 5 నుండి సీజన్ 5 జరుపుకుంటుంది. 19 మంది కంటెస్టెంట్స్‌తో ఈ సీజన్ మొదలు కాగా, తొలి వారంలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కాజల్, హమీదా, జెస్సీ, రవి, మానస్, సరయూలు డేంజర్ జోన్లో ఉన్నారు.
అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా విశ్వ.. జస్వంత్‌ల మధ్య చిన్నాపాటి డిస్కషన్‌గా తనని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు జస్వంత్ కన్నీరు పెట్టుకున్నాడు.ఆయనని తోటి కంటెస్టెంట్స్ ఓదార్చారు. ఎంతో మంది మోడల్స్‌గా తీర్చిదిద్దిన నువ్వు అలా ఏడవడం బాగోలేదు అంటూ కొందరు కంటెస్టెంట్స్ ఆయనకు సపోర్ట్‌గా నిలిచారు. అయితే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కూడా తోటి మోడల్‌కి తనవంతు సపోర్ట్ అందించారు.
కౌశల్ కూడా మోడల్ కాగా,ఆయన వన్ సైడ్‌గా నిలిచి టైటిల్ గెలుపొందారు. కౌశల్ తర్వాత మోడల్ అయిన అలీ రెజా బిగ్ బాస్ హౌజ్‌లో బానే సందడి చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 5లో మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి జస్వంత్ వచ్చారు. ఈ క్రమంలో ఆయనను ఉద్దేశించి కౌశల్ పోస్ట్ పెట్టారు. నా తర్వాత , అలీ తర్వాత మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది నువ్వని, మోడల్స్ కన్నీళ్లు పెట్టకూడదు అని చెప్పాడు. తమ యాటిట్యూడ్ లో ప్రేమని గెలుచుకోవాలి అన్నట్టుగా తెలిపాడు.. అంతే కాకుండా అలా ఏడిస్తే మొదటగా హౌస్ నుంచి ముందు నువ్వే బయటకి వచ్చేస్తావ్ సో జాగ్రత్తగా ఆడాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

