Uday Kiran | ఉదయ్ కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, ఔనన్నా కదన్నా లాంటి ఎన్నో ప్రేమకథా చిత్రాలను చేసి లవర్ బాయ్ గా అమ్మాయిల మనసులు గెలుచుకున్నాడు. ఇక ఉదయ్ కిరణ్‌కి ఓ రేంజ్లో స్టార్డమ్ వచ్చింది. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీని ఏలేస్తాడని అనుకున్నారు. కాని ఆ తర్వాత చేసిన సినిమాలు వరుస ఫ్లాపులు కావడం, అవకాశాలు రాకపోవడం ఉదయ్ కిరణ్‌ని మానసిక క్షోభకి గురి చేసింది. దీంతో ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచాడు.
అయితే ఉదయ్ కిరణ్ మరణం తర్వాత చాలా మంది చాలా రకాలుగా చెప్పుకొచ్చారు. తాజాగా బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ మరణించడమే మంచిది అంటూ కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు తెలుసు. బేగంపేటలో ఉండేవాడు. ఎంతో కష్టపడి ఎదిగాడు. కానీ ఇక్కడ ఎదుగుతున్నవారిని చూసి ఓర్వలేరు. 25 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను. పైకి ఎదిగేవారిని కిందకు లాగడమే ఇక్కడ నైజం అని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయ్‌ని మానసికంగా ఎంత హింసించారో నేను దగ్గర నుంచే చూశాను. అటువంటి టార్చర్‌తో బతకడం కన్నా చనిపోవడమే మంచిదనిపించిందేమో. చనిపోయిన తర్వాత అయినా అతని ఆత్మకు శాంతి దక్కుతుందని ఆశిస్తున్నా అంటూ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశారు. పైకి వెళ్లిన వారిని హింసించి మెసేజ్‌లు పెట్టి, ట్రోల్ చేసి కిందకు లాగేద్దామనే ఆలోచనతో చాలా మంది ఉన్నారని కామెంట్ చేశాడు.
కౌశల్ మందా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా నిలవడంతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ఆయన పలు టాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. ‘రాజకుమారుడు’, ‘బద్రీ’, ‘సంపంగి’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఉదయ్ కిరణ్‌తో ‘మనసంతా నువ్వే’, ‘శ్రీరామ్’, ‘నీ స్నేహం’, ‘జోడీ నెం.1’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఇటీవల మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో హీరో ఫ్రెండ్‌గా కనిపించి మెప్పించాడు.