Katy Perry | హాలీవుడ్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో డేటింగ్లో ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతవారం వీరిద్దరూ కాలిఫోర్నియా తీరంలో ఒక విలాసవంతమైన యాచ్ (Yacht) లో సన్నిహితంగా.. ముద్దులు పెట్టుకుంటూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా ఈ జంట మరోసారి కెమెరాకు చిక్కారు. శనివారం రాత్రి కేటీ పెర్రీ (41) తన పుట్టినరోజును జరుపుకునేందుకు జస్టిన్ ట్రూడో (53)తో కలిసి పారిస్‌లోని ప్రముఖ క్రేజీ హార్స్ పారిస్ (Crazy Horse Paris) క్యాబరే షోకు హాజరయ్యింది. ఈ షో ముగిసిన తర్వాత వేదిక నుంచి బయటకు వస్తున్న కేటీ పెర్రీ, ట్రూడో కలిసి నడుస్తూ కనిపించారు. ఈ సమయంలో వారిద్దరూ చేతులు పట్టుకుని ఆనందంగా నడిచారు. దీంతో వీరిద్దరూ నిజంగానే డేటింగ్లో ఉన్నారని హాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఈ వేడుకలో కేటీ పెర్రీ బ్యాక్‌లెస్ ఉన్న ఎరుపు రంగు గౌనులో ఆకట్టుకోగా, ట్రూడో పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు.
జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీ మధ్య సంబంధం గురించి గత కొద్ది నెలలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 2025 జూలైలో ఈ ఇద్దరూ కెనడాలోని మాంట్రియల్లో జరిగిన ఓ ప్రైవేట్ డిన్నర్ డేట్లో కలుసుకున్నారు. అప్పటి నుంచే వీరి డేటింగ్ వదంతులు మొదలయ్యాయి. జస్టిన్ ట్రూడో 2023 ఆగస్టులో తన 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తన భార్య సోఫీ గ్రెగోయిర్తో విడాకులు తీసుకున్నారు. అదేవిధంగా కేటీ పెర్రీ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నటుడు ఓర్లాండో బ్లూమ్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
katy perry & justin trudeau took their romance public tonight in paris pic.twitter.com/SS1jP1bMx4
— 𝓕avs (@favspopculture) October 26, 2025