‘మార్కో’ విజయం తర్వాత క్యూబ్ ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘కట్టలన్’. షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుకు పాల్ జార్జ్ దర్శకుడు. ఆంథోనీ వర్గీస్, రాజీషా విజయన్, కబీర్ దుహాన్సింగ్, సునీల్, జగదీష్, సిద్దీక్ ప్రధాన పాత్రధారులు. తెలుగు, మలయాళం భాషల్లో పానిండియా ఎంటైర్టెనర్గా రానున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొచ్చీలో ఘనంగా జరిగాయి.
ఈ ఈవెంట్లో ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. 45కోట్ల భారీ బడ్జెట్తో ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. అజనీష్ లోక్నాథ్, రవి బస్రూర్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియరానున్నాయి.