‘స్త్రీకి పరిపూర్ణతనిచ్చేది మాతృత్వమే. ఆ క్షణాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా..’ అని బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ అన్నారు. కత్రినా, విక్కీకౌశల్ త్వరలో అమ్మానాన్న కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కత్రిన 9వ నెల గర్భాన్ని మోస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన అనుభూతిని అభిమానులతో పంచుకున్నారామె. ‘అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 30.. ఈ మధ్య రోజుల్ని తలచుకుంటే హృదయం బరువెక్కుతోంది.
ఎందుకంటే.. నా జన్మ సార్థకమయ్యేది అప్పుడే. నేను నా బిడ్డను చూసుకునేది ఆ మధ్య కాలంలోనే. అందుకే కాస్త టెన్షన్‌గా, ఆతృతగా ఉంది.’ అని పేర్కొన్నారు కత్రినా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలావుంటే.. తమకు పుట్టబోయే బిడ్డను కొన్నాళ్లపాటు మీడియాకు దూరంగా ఉంచాలని కత్రినా, విక్కీకౌశల్ భావిస్తున్నారట. బిడ్డ పుట్టిన తర్వాత ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించాలనుకుంటున్నట్లు ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా తన కథనంలో పేర్కొన్నది.