మరో వివాదంలో అన్నమయ్య హీరోయిన్
కొందరు హీరోయిన్లు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. అలాంటి హీరోయిన్ కస్తూరి. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది కస్తూరి.

కొందరు హీరోయిన్లు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. అలాంటి హీరోయిన్ కస్తూరి. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది కస్తూరి. దాంతో పాటు మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేసింది. అయితే ఎక్కువగా తమిళ సినిమాలతో గుర్తింపు సంపాదించుకుంది కస్తూరి. ప్రస్తుతం మా టీవీలో వస్తున్న గృహలక్ష్మి సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. కానీ ఈమె ఎప్పుడూ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది.
మరోసారి ఈమె విషయంలో ఇదే జరిగింది. తాజాగా తమిళ నటుడు, నిర్మాత వెంకట్ సుభా కరోనా వైరస్ తో కన్నుమూసాడు. ఈయన మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈ మధ్యే కరోనా బారిన పడిన వెంకట్ చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 29 తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతిపై తమిళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. ఇందులో నటి కస్తూరి కూడా ఉన్నారు.
ఆయనకు సంతాపం తెలుపుతూ ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు..కొద్ది రోజుల కిందటే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు..ఆ మరుసటి రోజే ఆయనకు జ్వరం వచ్చింది.. టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది.. కొన్ని రోజులకు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.. ఇప్పుడు ఆయన చనిపోయారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. సారీ సుభాగారు..’ అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. అది చూసిన డీఏంకే కార్యకర్తలు, ఫాలోవర్స్, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా..? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా..? అంటూ కస్తూరిపై విరుచుకుపడుతున్నారు. దీనిపై ఇప్పటివరకు కస్తూరి రిప్లై ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి..
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

