Kartikeya | ‘ఆర్ఎక్స్100’, ‘గ్యాంగ్‌లీడర్’, ‘గుణ369’ వంటి సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘వలిమై’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించాడు. అయితే తాజాగా ఈయన హీరోగా తన తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటనను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
టాలీవుడ్‌లోని బడా ప్రొడక్షన్ సంస్థలలో ‘యూవీ క్రియేషన్స్’ ఒకటి. ఈ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకుల అభిప్రాయం. ఇప్పటివరకు ఈ సంస్థ నిర్మించిన సినిమాలలో 70% సక్సెస్ అయ్యాయి. పెద్ద సినిమాలే అని కాకుండా కంటేంట్ ఉంటే యువ హీరోలతో సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలోనే యువ హీరో కార్తికేయతో ఓ సినిమాను చేయబోతున్నట్లుగా ఈ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇటీవలే యూవీ సంస్థ తెరకెక్కించిన ‘రాధేశ్యామ్’ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.
An interesting journey is on the cards!🏎️
Announcing our next with the Talented @ActorKartikeya, Written & Directed by @Dir_PrashantShoot in Progress…@UV_Creations #Kartikeya8 pic.twitter.com/aSkqmzoTih
— UV Creations (@UV_Creations) April 8, 2022