విడుదలైన రెండేళ్ల తర్వాత ఖైదీ సినిమాపై కాపీ మరక
కార్తి కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమా ఖైదీ. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు అయిపోయింది. ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

కార్తి కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమా ఖైదీ. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు అయిపోయింది. ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ టేకింగ్‌కు చాలామంది ఫిదా అయ్యారు. కేవలం ఒక రాత్రిలో జరిగే కథతో పాటలు లేకుండా కేవలం స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. కార్తి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. 100 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. దీనికి అవార్డుల పంట కూడా బాగానే పండింది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కథ నాది అంటూ ఓ రైటర్ కోర్టు మెట్లెక్కాడు. విడుదలైన రెండేళ్ల తర్వాత దీనిపై కాపీ రైట్ ఇష్యూ వేశాడు రాజీవ్ అనే రైటర్.
తాజాగా ఖైదీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. దాంతో ఇదే అదునుగా కోర్టు మెట్లెక్కాడు ఈయన. ఒక కేసులో అరెస్ట్ అయి విడుదలైన రాజీవ్.. 2007లోనే స్నేహితుడి పరిచయంతో డ్రీం వారియర్స్ సంస్థకు ఖైదీ కథ చెప్పానంటున్నాడు. ఆ సమయంలోనే కథ నచ్చి అడ్వాన్స్ కూడా తీసుకున్నానని చెప్పాడు రాజీవ్. అయితే కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో తాను కూడా సైలెంట్ అయిపోయానని.. అయితే తన కథనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీగా తెరకెక్కించారని ఆయన కేరళ హై కోర్టును ఆశ్రయించాడు. తన కథను అనుమతి లేకుండా నిర్మించడమే కాకుండా కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వలేదంటున్నాడు రాజీవ్. ఇప్పుడు తన కథకు పారితోషికం కావాలని.. అలాగే క్రెడిట్స్ కూడా కావాలంటున్నాడు ఈయన. ఈ విషయం ప్రస్తుతం అక్కడి మీడియాలో వైరల్ అవుతుంది.
కేరళ హై కోర్టు ఈ విషయమై తమిళ నిర్మాణ సంస్థ అయిన డ్రీమ్ వారియర్, చిత్ర దర్శకుడికి నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై డ్రీమ్ వారియర్స్ సంస్థ మాత్రం మరోలా స్పందిస్తుంది. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని.. ఇది ఎవరి కథ కాదని చెబుతోంది. పూర్తి వివరాలు బయటికి వచ్చేంత వరకు దీనిపై స్పందించేది లేదంటున్నారు నిర్మాతలు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ అయితే దీనిపై అస్సలు స్పందించడం లేదు. మరోవైపు రాజీవ్ మాత్రం తన కథకు రూ.4 కోట్ల పారితోషికం ఇవ్వడంతో పాటు ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు కాపీ రైట్ తనకు మాత్రమే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదంటున్నాడు. ఖైదీ తర్వాత మాస్టర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా చేస్తున్నాడు ఈయన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్ అమ్మాయితో ఆమీర్‌ఖాన్ ఎఫైర్.. విడాకులు అందుకేనా?
రీమేక్‌లపై కన్నేసిన బాలీవుడ్.. పరాయి కథలతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
పవన్ సరసన మలయాళీ బ్యూటీ..!
థియేటర్స్ రీఓపెనింగ్..50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతి
బాలీవుడ్లో భారీగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

