కార్తీ కథానాయకుడిగా ఓ భారీ పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఇది కార్తి 29వ చిత్రం కావడం విశేషం. ‘తానక్కరన్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న డైరెక్టర్ తమిళ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు, ఎషాన్ సక్సేనా, సునీల్ షా, రాజా సుబ్రమణియన్ నిర్మాతలు. కార్తీకి ‘ఖైదీ’ వంటి బ్లాక్బాస్టర్ అందించిన సంస్థలో నిర్మితమవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
ఈ సినిమాను 2025లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ పానిండియా సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, ఐవీ ఎంటైర్టెన్మెంట్, బిఫోర్యు మోషన్ పిక్చర్స్ ప్రతాకాలపై ఈ చిత్రం రూపొందనుంది.