Karthi25 Movie Update | ఈ ఏడాది తమిళ హీరో కార్తికు బాగా కలిసి వచ్చింది. ‘విరుమన్’, ‘Ps-1’, ‘సర్ధార్’ వంటి హ్యట్రిక్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అదే జోష్‌తో ‘జపాన్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ప్రారంభించింది. ఈ చిత్రం కార్తికు 25వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికు జోడీగా అను ఇమాన్యూయేల్ హీరోయిన్గా నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక కార్తి ఇటీవలే ‘సర్దార్’తో భారీ విజయం సాధించాడు. పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.