karthikeya marriage | చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం.. పెద్దయ్యాక అలా అవ్వాలి ఇలా ఉండాలి అని కలలు కంటాం. కానీ విధి ఎటువైపు తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని సార్లు గట్టిగా అనుకుంటే అయిపోతుంది అంటారు. కదా ఒక హీరో విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. ఆయన ఎవరో కాదు.. ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ గుమ్మకొండ. తాజాగా ఈయన ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు లోహిత రెడ్డిని నవంబర్ 21న పెళ్లి చేసుకున్నాడు. ఈయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వివాహానికి హాజరై తమ ఆశీర్వాదాలు అందించారు. అందరి కంటే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని పెళ్లికి వచ్చి ఆశీర్వదించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన పెళ్లికి చిరంజీవి రావడంతో కార్తికేయ గాల్లో తేలిపోతున్నాడు. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు జరిగిన ఒక సరదా సంఘటన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు ఈ హీరో. ఇది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.
నేను పెదయ్యాక హీరో అవుతా.. అప్పుడు చిరంజీవి కూడా నా పెళ్లికి వస్తాడు.. అని చిన్నప్పుడు సరదాగా కుటుంబ సభ్యులతో కార్తికేయ అన్నాడు. ఇదే విషయం ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. తాను చిన్నప్పుడు సరదాగా అన్న విషయం విధి నిజంగానే నిజం చేసిందని మురిసిపోతున్నాడు. తన కలలు నిజం చేసి తన పెళ్లికి చిరంజీవిని రప్పించిన ఆ డెస్టినీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు కార్తికేయ. చిన్నప్పుడు తాను హీరో అవుతాను.. తన పెళ్లికి చిరంజీవి వస్తాడు అంటే అందరూ తనను చూసి నవ్వే వాళ్లని.. వీడు ఎప్పుడు ఇలాగే అంటాడు అంటూ లైట్ తీసుకునే వాళ్లు అని గుర్తు చేసుకున్నాడు కార్తికేయ. కానీ తర్వాత అదే నిజమైంది అంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారు మీరు ఆశీర్వదించడానికి వచ్చారు. ఎప్పటిలాగే మిమ్మల్ని అభిమానిస్తూనే వుంటాను. ఈ క్షణం నుంచి నీపై నా ప్రేమ మరింత పెరిగింది అంటూ ట్వీట్ చేశాడు ఈయన.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు కార్తికేయ. కేవలం హీరోగానే కాకుండా విలన్గా కూడా నటిస్తున్నాడు. అజిత్ వాలిమై సినిమాలో ఈయన ప్రతినాయకుడు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ప్రేమించిన అమ్మాయి లోహితను వివాహం చేసుకున్న కార్తికేయ.. కొన్ని రోజులు వైవాహిక జీవితం ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి షూటింగ్ తో బిజీ కానున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
karthikeya – lohitha marriage |ఘనంగా కార్తికేయ- లోహిత వివాహం.. పిక్స్
Kartikeya |ఆమెతో 11 ఏళ్ల ప్రేమ .. లవ్ స్టోరీలో విలన్ల గురించి బయటపెట్టిన కార్తికేయ
Karthikeya | కార్తికేయ భార్య ఆర్ఎక్స్100 సినిమా ఎందుకు చూడలేదో తెలుసా?
Priyanka Chopra: సమంత మాదిరిగా ప్రవర్తిస్తున్న ప్రియాంక.. విడాకులకి సిగ్నలా ఇది..!
Janhvi Kapoor | శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో..!!
RRR: పునీత్ స్టైల్లో నాటు నాటు సాంగ్.. వైరల్గా మారిన వీడియో