Nikhil Siddarth | యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో ఈ చిత్రం అవార్డును గెలుచుకుంది. అయితే ఈ విషయంపై నటుడు నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేశాడు.
కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం పంచుకోవడానికి వెంటనే మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం, ఈ అవార్డు రావడం అనేది మా టీం చేసిన కృషి ఫలితమే. ఈ చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, వివేక్, అలాగే దర్శకుడు చందు మోండేటి, హీరోయిన్ అనుపమా, సంగీత దర్శకుడు కాలా భైరవ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లు అందరు చూసిన సినిమా ఇది. అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో విడుదలై చాలా సక్సెస్ సాధించింది. ముందుగా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలి. అలాగే జ్యూరీ సభ్యులకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ నిఖిల్ చెప్పుకోచ్చాడు.
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కార్తికేయ సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తాజాగా నేషనల్ ఫిలిం అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఈ చిత్రం అవార్డు గెలుచుకుంది. బలగంతో పాటు మేజర్, సీతారామం ఈ పోటీలో ఉండగా.. కార్తికేయ ఈ అవార్డును దక్కించుకుంది.
Hero #Nikhil expresses his joy by sending out huge thanks and congratulating his team of #Karthikeya2 on winning The Best Telugu Film award at the prestigious 70th National Film Awards pic.twitter.com/XEXADsUGC6
— Vamsi Kaka (@vamsikaka) August 16, 2024