Karthikeya-2 Movie OTT Plat Form | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘కార్తికేయ-2’ హవానే కనిపిస్తుంది. ఎన్నో వాయిదాల తర్వాత ఆగస్టు 12న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. మొదటి రోజు లిమిటెడ్ స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగో రోజుకు స్క్రీన్ కౌంట్ మూడింతలయింది. మొదటి రోజుకు మించి నాలుగో రోజు అత్యధిక కలెక్షన్లను సాధించి.. కంటెంట్ ఉంటే కలెక్షన్లకు అడ్డేది అని నిరూపించింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్లో రోజు రోజుకు కార్తికేయ-2పై క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘కార్తికేయ-2’ ఓటీటీ హక్కులను ప్రముఖ స్టార్ ఓటీటీ సంస్థ జీ-5 దక్కించుకుంది. భారీ ధరకు ఈ మూవీ థియేట్రికల్ హక్కలను జీ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. ఇక ఈ చిత్రం 6 వారాల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంతో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. ఇటీవలే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని టాలీవుడ్ 11వ క్లీన్ హిట్‌గా నిలిచింది.