Karthik Subbaraj | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game changer). ఆర్సీ15గా వస్తోన్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj)రైటరే కాదు.. టాలెంటెడ్ డైరెక్టర్ అని తెలిసిందే. మరి గేమ్ ఛేంజర్‌కు ఎందుకు దర్శకత్వం వహించలేదన్న ప్రశ్నపై క్లారిటీ ఇచ్చాడు కార్తీక్ సుబ్బరాజు.
శంకర్ సార్ దర్శకత్వం తాను దర్శకత్వం వహించగల స్క్రిప్ట్‌లు ఏమైనా ఉన్నాయా అని నన్ను అడిగినప్పుడు రచయితగా, దర్శకుడిగా నేను చాలా గౌరవంగా ఫీలయ్యా. గేమ్ ఛేంజర్ కథను ఆయనకు చెబితే.. చాలా లైక్ చేశాడు. గేమ్ ఛేంజర్ ప్లాట్‌కు భారీ స్థాయి డిమాండ్ ఉంది. శంకర్ సర్ లాంటి వారు మాత్రమే ఆ ప్లాట్‌కు న్యాయం చేయగలరు. గేమ్ ఛేంజర్ శంకర్ సర్ స్టైల్లో సాగే పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. ఇది శంకర్ జోన్లో ఉంటుంది.. అని చెప్పుకొచ్చాడు కార్తీక్ సుబ్బరాజు.
కమర్షియల్ సినిమాలు చేయడంలో శంకర్ ఎక్స్పర్ట్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శంకర్ సామాజిక సందేశానికి వినోదాన్ని జోడించి సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుందని తెలిసిందే. గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సోమవారం షురూ అయింది. షూటింగ్ లొకేషన్ నుంచి విడుదలైన ఓ స్టిల్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. లొకేషన్లో శంకర్ సీన్ వివరిస్తుండగా.. రాంచరణ్ సూపర్ కూల్ లుక్‌లో శ్రద్దగా వింటున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాజోలు భామ అంజలి మరో కీలక పాత్ర పోషిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రాంచరణ్ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ 16కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
షూటింగ్ లొకేషన్లో శంకర్, రాంచరణ్..
A SURESHOT #GAMECHANGER !! 🔥
This 💥❤️ pic.twitter.com/mmw1JR7cQi
— thaman S (@MusicThaman) October 10, 2023
కియారా అద్వానీతో శంకర్..