Sathyam Sundaram | కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ (Karthi), అరవింద స్వామి (Aravindha Swamy) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ’96’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఫుల్ ఎమోషనల్‌గా సాగింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ అందించినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ’96’ లాంటి లవ్ స్టోరీతో ఆకట్టుకున్న ప్రేమ్ కుమార్ ఈసారి ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 96 సినిమా సంగీత దర్శకుడు గోవింద్ వసంత (Govindha Vasantha) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
It’s a clean ‘U’ for the heartwarming family entertainer #SathyamSundaram! #SathyamSundaramFromSep28 pic.twitter.com/5QB0DW3iBQ
— BA Raju’s Team (@baraju_SuperHit) September 26, 2024