Karthi 29 Movie | తమిళ కథానాయకుడు కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సర్థార్ 2 సినిమాను కంప్లీట్ చేసిన కార్తి మరోవైపు వా వాతియర్ సినిమాకు కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇవే కాకుండా ఇప్పుడు మరో ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడు. కార్తి కెరీర్లో 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు తమిళ్(Tamizh) దర్శకత్వం వహిస్తుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సముద్ర నేపథ్యంగా సాగే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో కార్తి మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టైటిల్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు మార్షల్(Marshal) అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమాలతో పాలు షూటింగ్ కూడా మొదలుపెడుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించబోతుండగా.. సత్యరాజ్, ప్రభు, లాల్, ఈశ్వరి రావు, మురళి శర్మ, జాన్ కొక్కేన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు.
మరోవైపు ఈ సినిమాలో తెలుగు నటుడు నాని అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల నాని నటించిన హిట్ 3 సినిమాలో కార్తి అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. హిట్ 4లో కార్తినే కథానాయకుడిగా నటించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధాన్ని దృష్టిలో పెట్టుకొని కార్తి 29లో నానిని భాగం చేయాలని చిత్రబృందం భావిస్తుందని సమాచారం.
Dear Friends,
Taking a new step forward with all your love and blessings!! #Marshal #மார்ஷல் begins from today!! pic.twitter.com/KzxDxRpYRa
— Karthi (@Karthi_Offl) July 10, 2025