కార్తి కథానాయకుడిగా నటిస్తున్న ‘జపాన్’ చిత్రం మంగళవారం చెన్నైలోప్రారంభమైంది. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. కార్తి నటిస్తున్న 25వ చిత్రమిది కావడం విశేషం. ‘విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. కార్తి పాత్ర ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. త్వరలో తొలి షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవివర్మన్, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: వినేష్ బంగ్లాన్, రచన-దర్శకత్వం: రాజు మురుగన్.