Karnataka Govt New GO On movie ticket Prices | మూవీ లవర్స్‌కు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టగా.. ఈ బడ్జెట్లో సినీ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. బడ్జెట్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో సినిమా టికెట్ ధరను రూ.200కి పరిమితం చేస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. మల్టీప్లెక్స్‌లలో సాధారణ సీట్లకు టికెట్ ధర రూ.200 దాటకూడదు. అయితే గోల్డ్ క్లాస్ స్క్రీన్లు మరియు గోల్డ్ క్లాస్ సీట్లకు ఈ పరిమితి వర్తించదని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అంతేకాకుండా, కన్నడ సినిమాలను ప్రోత్సహించేందుకు మల్టీప్లెక్స్‌లలో కన్నడ, తులూ అలాగే ప్రాంతీయ చిత్రాలను ప్రైమ్ టైమ్‌లో ప్రదర్శించడం తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. అదనంగా, కన్నడ సినిమాల ప్రచారం కోసం ఒక OTT ప్లాట్‌ఫాంని కూడా తక్కువ ధరలో ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.