నాగమహేష్, రూపాలక్ష్మి, ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కర్మణి’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రమేష్ అనెగౌని దర్శకుడు. మంజుల చవన్, రమేష్‌గౌడ్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు నాగమహేష్ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ..వినూత్నమైన కథాంశమిదని, మే మొదటివారంలో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ కొమరి, సంగీతం: జాన్భూషణ్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణ సంస్థ: రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మి ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ అనెగౌని.