మా ఎన్నికలు వాళ్లతోనే అసలు ప్రమాదం అంటున్న సభ్యులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు రసవత్తర పోరుకు తెరలేపింది. మా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే మాటల యుద్ధాలు మొదలయ్యాయి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు రసవత్తర పోరుకు తెరలేపింది. మా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే మాటల యుద్ధాలు మొదలయ్యాయి. ఎన్నికలు జరిగేలోపు ఇంకా చాలానే యుద్ధాలు చూడాల్సి వచ్చేలా ఉంది. ఈ సారి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకుందామని ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకు వచ్చి కోరిన మరుసటి రోజే రచ్చ మొదలైంది.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు తెలుపుతున్నట్లు మాట్లాడిన నాగబాబు.. మా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడు నాలుగేళ్లుగా మా అసోసియేషన్ ప్రతిభ మసకబారుతుందని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ మండిపడ్డారు. అసోసియేషన్ ప్రతిష్ట మసకబారేలా ఏం చేశామో చెప్పాలంటూ మీడియా ముందుకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సారి మా ఎన్నికల్లో కొందరితో మాత్రం ఖచ్చితంగా సమస్యలు వస్తాయని మా సభ్యులు కూడా బహిరంగంగానే చెబుతున్నారు. కొందరు నోటి దురుసుతో చేసే వ్యాఖ్యలతో వివాదాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కరాటే కళ్యాణి ప్రకాశ్ రాజ్‌పై విమర్శలు మొదలుపెట్టింది. వెనకా ముందు చూసుకోకుండా ఈమె మాట్లాడే మాటలకు తమ ప్యానెల్ సభ్యులు కూడా ఒక్కోసారి ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ నరేశ్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతుంటే.. కరాటే కళ్యాణి మధ్యలో మైక్ తీసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి నరేశ్ చాలా ప్రయత్నించాడు.
మరోవైపు బండ్ల గణేశ్, రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్లు కూడా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో నోరు పారేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ఈసారి కూడా ఇదే జరుగుతుందేమోనని మా సభ్యులు భయపడుతున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా మా అధ్యక్ష ఎన్నికలు జరగాలంటే కచ్చితంగా అందరూ నియమ నిబంధనలు పాటించాల్సిందేనని అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఎవరు ఎప్పుడు మీడియా ముందుకొచ్చి బాంబు పేలుస్తారో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎంత సజావుగా జరుగుతాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెళ్లి పీటలెక్కిన జబర్ధస్త్ కంటెస్టెంట్స్
కాజల్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ఘనంగా శంకర్ కూతురి వివాహం.. హాజరైన సీఎం
‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నా: మంచు విష్ణు
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

