‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నా: మంచు విష్ణు
మంచు విష్ణు| తాను కూడా ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్నానని, నామినేషన్ వేస్తున్నానని హీరో మంచు విష్ణు ప్రకటించారు. సినీ పరిశ్రమను నమ్మిన కుటుంబంలో పుట్టానని, తెలుగు సినిమాతోనే పెరిగానని చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో పోటీపై మంచు విష్ణు లేఖ విడుదల చేశారు.

హైదరాబాద్: తాను కూడా ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్నానని, నామినేషన్ వేస్తున్నానని హీరో మంచు విష్ణు ప్రకటించారు. సినీ పరిశ్రమను నమ్మిన కుటుంబంలో పుట్టానని, తెలుగు సినిమాతోనే పెరిగానని చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో పోటీపై మంచు విష్ణు లేఖ విడుదల చేశారు. ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలు తనకు బాగా తెలుసునని ఆ లేఖలో పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉందని చెప్పారు. పరిశ్రమ రుణం తీర్చుకోవడం, సేవ చేయడమే తన కర్తవ్యమని ప్రకటించారు.
‘మా’ అధ్యక్షుడిగా తన తండ్రి మోహన్‌బాబు చేసిన సేవలే తనకు స్ఫూర్తి అని వెల్లడించారు. ‘మా’ భవనం ఖర్చులో 25 శాతం ఇస్తానని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నడవాలనేదే తన ప్రయత్నమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందామని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

