Ibrahim Ali Khan | బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సైఫ్ అలీఖాన్ కొడుకు.. దర్శకుడు ఎవరంటే.!
Karan Johar - Ibrahim Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Karan Johar – Ibrahim Ali Khan | బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. ఇబ్రహీం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెడుతూ.. ఇబ్రహీంని బాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాను అంటూ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు.
12 ఏండ్ల క్రితం ఇబ్రహీం అలీఖాన్ తల్లి అమృత (సైఫ్ అలీఖాన్ మొదటి భార్య)ని మొదటి సారి నేను కలిశాను. తనను డింగి అని పిలవడం నాకు అలవాటు. అమృత మా నాన్నతో కలిసి ధర్మ ప్రోడక్షన్స్‌లో ‘దునియా’ అనే సినిమా చేసింది. ఈ సినిమా తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తనతో కలిసి చైనీస్ డిన్నర్ చేయడం.. జేమ్స్ బాండ్ సినిమా చూడడం.. ఇప్పటికి మర్చిపోలేను. మేము కలిసిన సెకండ్ టైంలోనే నన్ను స్వంత మనిషిలా చూసుకుంది. సైఫ్‌ని నేను మొదటిసారి ఆనంద్ మహింద్రా ఆఫీస్‌లో కలిశాను. ఆ తర్వాత ఈ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఏర్పడింది. సినిమా అనేది వీరి రక్తంలోనే ఉంది. త్వరలోనే మీ ముందుకు ఇబ్రహీం అలీఖాన్ని పరిచయం చేయబోతున్నాను. అప్పటివరకు వెయిట్ చేయండి అంటూ కరణ్ జోహర్ రాసుకోచ్చాడు.
నటి శ్రీలీలతో కలిసి ఇబ్రహీం అలీఖాన్ రెస్టారెంట్లో నుంచి బయటికి వచ్చిన ఫొటోలు ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇబ్రహీం డెబ్యూ మూవీలో హీరోయిన్గా శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

