Kantha Rao | ప్రముఖ దివంగత లెజెండరీ నటుడు టిఎల్ కాంతారావు (Kantha Rao) శతజయంతి వేడుకలను ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. కాంతారావు కుటుంబసభ్యులు, అక్కడి తెలుగు వారి ఆధ్వర్యంలో వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కుటుంబసభ్యులు ఓ సందేశాన్ని అందరితో పంచుకున్నారు.
‘మా తాతయ్య స్వర్గీయ టిఎల్ కాంతారావు శత జయంతి వేడుకలను (100th Birth anniversary ) అడిలైడ్‌లో ఉన్న తెలుగువారంతా మాతో కలిసి చాలా ఘనంగా చేశారు. చిత్ర పరిశ్రమలో ఆయన అద్భుతమైన ప్రయాణం గురించి అందమైన పరిచయంతో ఈవెంట్‌ని ప్రారంభించాము. పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులందరి సమక్షంలో ఈవెంట్ చాలా బాగా జరిగింది. మాకు, మా అమ్మ సుశీలరావుకు ఈ మహత్తర కార్యక్రమంలో భాగమయ్యే చాలా గొప్ప అదృష్టం కలిగింది. ‘రాకుమారుడు’ కత్తి కాంతారావు శతజయంతి సందర్భంగా ఆయనను సత్కరించి.. వేడుక జరిపినందుకు తెలుగు సమాజం మొత్తం కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
Kantharao4
‘కంచు కోట’లోని తన ఫేవరెట్ సాంగ్‌పై లెజెండరీ నటుడి ముని మనవరాలైన వెనీషా స్వాగత నృత్యం చేసింది. నృత్యం తర్వాత శిల్పా (లవ కుశ చిత్రం నుండి యె నిమిషానికి యేమిజరుగునో) అపర్ణ (ఏకవీర చిత్రం నుండి ప్రతి రాత్రి వసంత రాత్రి) పాటలు పాడటం వంటి ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నటీనటులు శ్రేయోభిలాషులు, సహనటులు తమ గౌరవాన్ని, అనుభవాలను వీడియోలు, లైవ్ కాల్ ద్వారా షేర్ చేసుకున్నారు. రాజశ్రీ , వాణిశ్రీ, మురళీ మోహన్ , రోజా రమణికి ప్రత్యేక ధన్యవాదాలు. దివంగత నటుడితో వారు తమ జ్ఞాపకాలు, అనుభవాలు వారి అనుబంధాన్ని పంచుకోవడం కుటుంబ సభ్యులకు ఒక భావోద్వేగ క్షణం.
ఆయన అభిమానులను కలవడం చాలా ఆనందంగా ఉంది. వారందరూ ఆయనను ఈ రోజు వరకు ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా గౌరవిస్తారో తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నటన, అంకితభావం, వృత్తి పట్ల ఉన్న నిబద్ధత, నటన పట్ల ఆయనకున్న మక్కువ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి తెలుగు సభ్యునిచే గుర్తించబడుతున్నాయని తెలిసి మాకు గర్వంగా అనిపించింది. ఈ కార్యక్రమం కాంతారావును స్మరించుకోవడానికి, ఆయన అందమైన జ్ఞాపకాలను, సేవలను గుర్తుచేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చింది. దివంగత నటుడు కటకం రాజన్, ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు మాకు మద్దతుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు’.
శతజయంతి వేడుకల ఫొటోలు..
Kantharao1
Kantharao2
Kantharao3
Kantharao5
Kantharao6
Kantharao7
Kantharao9
Kantharao61