Kantara Movie | కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథనే ఎంత కొత్తగా చెప్పాము అనేది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాలో రిషబ్‌శెట్టి దర్శకుడిగా ఒక మెట్టు ఎక్కితే.. నటుడిగా పది మెట్లు ఒకేసారి ఎక్కాడు. వందల కోట్ల బడ్జెట్‌తో వచ్చిన డబ్బింగ్ సినిమాలకే తెలుగులో పట్టుమని పది కోట్ల ప్రాఫిట్ కూడా రాదు.
అలాంటింది కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కిన కాంతార తెలుగులో దాదాపు రెట్టింపు షేర్‌ను రాబట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. తెలుగులో ఈ సినిమాకు కేవలం రూ.2.5 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్ ముగిసే సరికి ముప్పై కోట్ల కలెక్షన్లు సాధించి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కన్నడ సినిమాను మరోసారి శిఖరం కూర్చొబెట్టింది. ఇక ఇప్పటికే ఓటీటీలో అదరగొడుతున్న ఈ సినిమా తాజాగా మా టీవిలో టెలికాస్ట్ అయింది. స్టార్ మాలో ప్రసారం అయ్యిన ఈ సినిమాకు 12.35 రేటింగ్ వచ్చింది.
ఈ మధ్య కాలంలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు టీఆర్పీలు దాదాపు పదిలోపలే ఉన్నాయి. అలాంటిది ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో టీఆర్పీ సాధించిందంటే విశేషం అనే చెప్పాలి. ఇక చిరు గాడ్‌ఫాదర్ కూడా కేవలం 7.69 టీఆర్పీ రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. వెండితెరపైనే కాదు బుల్లి తెరపై కూడా కాంతార తెలుగులో ప్రభంజనం సృష్టించింది. ఇక ఇటీవలే మేకర్స్ ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉందని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రీక్వెల్‌లో రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటెళ్లారు అనే అంశాలను చూపించబోతున్నట్లు టాక్.